Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కలిసిన ఆల్ మేవా

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఉమ్మడి అనంతపురం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా ఇటీవల కాలంలో పదవి బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ డైరెక్టర్ రామ సుబ్బారెడ్డి ని ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) ప్రతినిధులు బుధవారం ఉదయం అనంతపురం లోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ షావలి ప్రధాన కార్యదర్శి ఫరూక్, సహా అధ్యక్షులు ఫకృద్దిన్, ఎడి రసూల్, అమీర్, ఎక్బాల్, అన్వర్ తదితరులు మైనార్టీ సంక్షేమ అధికారికి శాలువాను కప్పి, పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం, మైనార్టీ క్రిస్టియన్లకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాలో ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ సమాజాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేయాలని మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తగినంతగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ఆల్ మేవా ప్రతినిధులు మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాలో మైనార్టీలకు ప్రభుత్వం ద్వారా అమలవుతున్న జగనన్న వసతి దీవెన,జగనన్న విద్యా దీవెన పథకం ను సమర్థవంతంగా అమలు చేయుటకు చర్యలు చేపట్టాలని, 15 సూత్రాల పథకాన్ని అమలు చేయాలని, మైనార్టీ హాస్టళ్ళ పనితీరుపై దృష్టిని సారించి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఆల్ మేవా నాయకులు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img