Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

నీట్ ఎండిఎస్ పరీక్షల్లో ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించిన ధర్మవరం విద్యార్థిని అంబటి నైమిశ

విశాలాంధ్ర – ధర్మవరం : నీట్ ఎండిఎస్ పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా 29వ ర్యాంకును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం విద్యార్థిని అయిన అంబటి నైమిశ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు నాగరాజు, తల్లి అర్చన మాట్లాడుతూ నైమిశా చిన్నతనం నుండి చదువు పట్ల ఎంతో ఆసక్తిని చూపేదని, పట్టుదలతో, శ్రమతో కష్టపడి,ఇష్టపడి చదువుతూ చదువుపట్ల అధికంగా మమకారం చూపుతోందని తెలిపారు. పదవ తరగతి ని యశోద కాన్సెప్ట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ను హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదివిందని వారు తెలిపారు. నీట్ ఎండీఎస్ పరీక్ష ఫలితాలలో 29వ ర్యాంకును సాధించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి అంబటి నైమిశ మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహకరముతోనే తాను ఇంతటి ర్యాంకును సాధించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ప్రజలకు సేవా భావంతో మున్ముందు నా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని వారు తెలిపారు. నీట్ ఎండీఎస్ కోచింగ్ను కర్ణాటకలోని దావనగిరిలో తీసుకున్నానని తెలిపారు. నాగరాజు అర్చన తల్లిదండ్రులకు ఈ విద్యార్థిని మొదటి సంతానం. తమ్ముడు నిఖిల్ దత్త ఇంజనీరింగ్ బెంగళూరులో చదువుతున్నాడని తెలిపారు. మొత్తం మీద ధర్మవరం పేరు ప్రతిష్టాలను నైమిశాకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img