Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు పట్టణ ప్రజల నీరాజనం

ఎమ్మెల్యే అవినీతి కోటలు కూల్చడానికే తాను వచ్చాను
టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్

విశాలాంధ్ర – ధర్మవరం : స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అవినీతి కోటలు కూల్చడానికే తాను ఉమ్మడి అభ్యర్థిగా ధర్మవరానికి రావడం జరిగిందని, అందరి సహాయ సహకారాలతో తాను అధిక మెజారితో గెలుస్తానని ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ధర్మవరానికి వారు విచ్చేయడంతో పట్టణ ప్రజలు,టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో వారికి స్వాగతం పలికారు. సత్య కుమార్ యాదవ్ వెంబడి టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్తోపాటు టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారథి, బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం. శేఖర్ కూడా ఉన్నారు. సత్య కుమార్ యాదవ్ పర్యటన ఎర్రాయపల్లి నుంచి ధర్మవరం వరకు వేలాదిమంది టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు నడుమ ఎండను లెక్కచేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదుపరి గజమాలతో సత్యకుమార్ యాదవ్ కు, పరిటాల శ్రీరామ్కు, డీకే పార్థసారధికి ప్రజలు పట్టం కట్టారు. రోడ్ షోలో సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, బి.కె పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రజలను ఉత్తేజపరిచాయి. అడుగడుగునా ఘన నిరాజనంతో వారి పర్యటన కొనసాగింది. ఉమ్మడి పార్టీల జెండాలతో పట్టణం జన సముద్రంగా మారింది. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ చేనేత వ్యవస్థను బాగుపరచడమే నా లక్ష్యమని, నియోజకవర్గ సమస్యలన్నింటినీ తాను తప్పక తీరుస్తానని హామీ ఇచ్చారు, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఆయన భాషలోనే సమాధానం ఇవ్వడంతో ప్రజల యొక్క కేరింతలు మారుమోగాయి. అందరి లెక్కలు తేల్చేందుకే ధర్మారం వచ్చాను అని సత్యకుమార్ మాటలు అందరినీ ఉత్తేజపరిచాయి. తొలిసారి తాను ధర్మవరం రావడానికి ఇంతటి ప్రజల ఆదరణ నాకు లభించడం అదృష్టంగా భావిస్తానని అదేవిధంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల నుండి తాను ప్రజల ద్వారా అధిక మెజారిటీతో గెలుస్తానని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, సీనియర్, జూనియర్ నాయకులతో తాను కలిసి పని చేస్తానని వారు తెలిపారు. నా పర్యటనలో వేలాదిమంది ప్రజలు కార్యకర్తలు నాయకులు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అక్కడక్కడ రోడ్ షోలో సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, బి.కె పార్థసారథి మాట్లాడిన మాటలు హోరెత్తించాయి. అనంతరం పరిటాల శ్రీరామ్ బికే పార్థసారథి మాట్లాడుతూ సత్య కుమార్ యాదవ్ కు మా పూర్తి మద్దతు ఉందని, మా పార్టీ తరఫున సత్య కుమార్ యాదవ్ ని తప్పక అధిక మెజార్టీతో గెలుపు గెలిపించుకుంటామని తెలిపారు. ఇక్కడ చేనేతలు రైతులు కూలీలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం దొరకాలంటే సత్యకుమార్ ఎంఎల్ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో ధర్మారం పేరు వినిపించిందని సత్య కుమార్ గెలుపు తర్వాత ఆస్తిలో ఈ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంటుందని వారు తెలిపారు. అలాగే మహిళలకు ఉపాధి అవకాశాల కోసం స్టిచ్చింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తారని మరోవైపు ముస్లింల కబస్తాన్ హిందువుల స్మశాన వాటికల సమస్యలు కూడా తప్పక తీరుస్తారని తెలిపారు. మరోవైపు బిజెపి అభ్యర్థి కాబట్టి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇక్కడ వారి భద్రతకు, రక్షణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకాలకు ఇక చెక్కు పెట్టే సమయం వచ్చిందని తెలిపారు. సత్య కుమార్ యాదవ్ను గెలిపించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు దేనిని వారు పిలుపునిచ్చారు. సత్య కుమార్ యాదవ్ రాయలసీమ బిడ్డనని వారు గుర్తు చేశారు. మొత్తం మీద వీరి పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, పని కుమార్, పరిసే సుధాకర్, కమతం కాటమయ్య ,పురుషోత్తం గౌడ్, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వందల సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img