Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

యువతకు ఆదర్శం రక్తబంధం ఆర్గనైజేషన్ సంస్థ….. కన్నా వెంకటేష్

విశాలాంధ్ర -ధర్మవరం: నేటి యువతకు రక్షబంధన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్, గ్రూపు సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేలాది మందికి రక్తదానం ప్లేట్లెట్స్ అందడం, నిజంగా బాధితులకు పునర్జన్మ ఇచ్చినట్లు అవుతోంది. అనంతపురం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అత్యవసర సమయంలో జీవన్ కిషోర్ అనేవారికి జ్వరము వలన పూర్తిగా తగ్గిపోవడంతో సమాచారం వచ్చిన వెంటనే కన్నా వెంకటేష్, దీపు బ్లడ్ బ్యాంకు కు వెళ్లి, ప్లేట్లెట్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు తాను 20 సార్లు రక్తదానం చేశానని 12 సార్లు ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని, రక్త దానం రుణం తీర్చుకోలేనిదని, విలువ కట్టలేనిదని, మానవతా విలువలను ప్రోత్సహించే ఈ రక్త దానం మహాదానమని వారు తెలిపారు. ప్రమాద బాధితులకు, ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా ప్లేట్లెట్స్ ను ఇవ్వడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే మానవ జన్మకు సార్థకం ఉంటుందని తెలిపారు. డబ్బుతో ప్రతి వ్యక్తి ఏదైనా సాధించగలడు. కానీ కొనలేని వస్తువు ఒక్క రక్తదానం మాత్రమేనని తెలిపారు. రక్తదానం వలన ఎంతోమందికి ప్రాణాలను ఇచ్చిన వాళ్ళము అవుతారని తెలిపారు. రక్త బంధం ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img