Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

అమ్మ ఒడి విడుదల పై హర్షం

విశాలాంధ్ర- ఉరవకొండ : పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తుకు ఎదగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వ్యవస్థ కు పెద్ద పీట వేశారని మండల కో ఆప్షన్ మెంబర్ పామిడి సలిం వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యం.జిలాన్ బాషా తెలిపారు. బుధవారం అమ్మ ఒడి పథకం విడుదల సందర్భంగా వైసీపీ విద్యార్థి సంఘం నాయకులు తేజా, దేవా ఆసిఫ్, పవన్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని స్థానిక ఎస్కె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సీఎం చిత్ర పటానికి పాలాబిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వారు మాట్లాడుతూ అమ్మవడి నగదును నేరుగా బ్యాంకులో వేయ్యడం అభినందనియం అని కొనియాడారు. గత ప్రభుత్వం లో విద్యార్థులకు స్కాలర్ షిప్. ఫీజు రీయెంబర్స్ మెంట్ కోసం అనేక పోరాటాలు చెయ్యల్సిన దుస్థితి ఉండేదని జగన్ సీఎం అయిన తర్వాత కులమతాలకు పార్టీలకు అతీతంగా. ఇచ్చిన హామీలు అమలు చేసి దేశంలోనే ఆదర్శ సీఎం గా నిలిచారన్నారు అమ్మవడి, వసతి దీవేన. విద్యా దీవెన. విద్యా కానుక. మద్యాహ్నం భోజనం పథకం లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు డైరెక్టర్ యం. ఇంతియాజ్ భాష వైసీపీ మైనార్టీ నాయకులు అన్వర్. యం. రఫిక్ ఖదర్. వైసిపి విద్యార్థి విభాగం నాయకులు. బాబ్ జాన్. కిరణ్. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img