Friday, June 14, 2024
Friday, June 14, 2024

కౌలు రైతులు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి

విశాలాంధ్ర-రాప్తాడు :ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం

కౌలు రైతు సంఘంరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సనప నీళ్లపాల రామకృష్ణ మాట్లాడుతూ…
ఆత్మకూరు మండల వ్యాప్తంగా కౌలురైతులకు వైఎస్ఆర్ ప్రభుత్వం,గుర్తింపు కార్డులు జారీ చేసింది. ఈ సంవత్సరం సుమారు 5లక్షల 70వేల కార్డులు ఇస్తామని జిల్లాల వారిగా టార్గెట్ నిర్ణయించింది. కౌలు రైతులు సచివాలయంలో గుర్తింపుకార్డు మంజూరు చేస్తున్నారు,కౌలు రైతులు వెంటనే సచివాలయానికి పోయి దరఖాస్తు చేసుకోవలెను సచివాలయంలో .ధరఖాస్తూ ఫారం ఇస్తున్నారన్నారు.
మీరు చేయవలసిన పని ఏమిటి!
మీరు గ్రామ సచివాలయంలోని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వి.ఆర్. ఓ)కలసి ధరఖాస్తులు ఫారాలు ఇవ్వమంటే ఇస్తారు అన్నారు . అవి తీసుకుని అందులో వివరాలు పూర్తి చేసి, జతపర్చవలసిన పత్రాలు జతచేసి వి ఆర్ ఓ కు ఇవ్వాలి అని పేర్కొన్నారు.
ఒక వేళ భూయజమాని సంతకం పెట్టకపోతే గ్రామ సచివాలయంలో ఉన్న వి. ఆర్. ఓ ద్వారా గ్రామ సచివాలయంలోని వాలంటీర్స్ వెళ్ళి భూ యజమానులచే సంతకం పెట్టించమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారు హక్కుల చట్టంలో ఏముంది అంటే భూయజమానులకు, కౌలురైతుల మద్య గ్రామ సచివాలయం వాలంటీర్స్ అనుసంధానంగా వ్యవహారిస్తారని పేర్కొంది.కాబట్టి కార్డులు ఇప్పించే భాద్యత ప్రభుత్వానిదే. మన సంఘం నాయకులు, కార్యకర్తలు వి ఆర్ ఓ ఆఫీసు నుండి దరఖాస్తులు తీసుకుని కౌలురైతుల వివరాలు పూర్తి చేసి ఫోటో, ఆధార్ కార్డు తదితర పత్రాలు వి ఆర్ ఓ కు ఇచ్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img