Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వి .సుజాత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని పొగాకు మరియు వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలియజేశారు . కార్యక్రమానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం ర్యాలీ చేపట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి తెలుగు తల్లి కూడలి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీ లో పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని నినాదాలు చేశారు. మనిషి యొక్క ఆయుష్షు క్షీణిస్తోందని కావున పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్నారు.ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని తెలియజేశారు. అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అన్నారు పొగాకు నియంత్రణ కార్యక్రమ నిర్వహణ అధికారి డా. నారాయణస్వామి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వినియోగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది అలాగే దేశంలో సంభవించే అత్యవసర మరణాల గణాoకాలలో ప్రతి వంద మందిలో పదిమంది బాధ్యులుగా ఉన్నారన్నారు. అలాగే 15 నుంచి 24 సంవత్సరముల వయసు పిల్లలలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు సిగరెట్ ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల బారిన
పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఇలా యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల దేశ భవిష్యత్తు కు ముప్పు అని అన్నారు.
సిగరెట్ వాడడం వలన అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి క్యాన్సర్ కు ముఖ్యంగా నోటికి మరియు గొంతు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయన్నారు. బహిరంగ ధూమపానము చేసిన మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, మరియు జరిమానా గా 200 రూపాయలు విధించడం జరుగుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి ప్రచారం నిర్వహించ రాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్. యుగంధర్ మాట్లాడుతూ… ధూమపానం వల్ల మరియు ఆ వదిలే పొగ సేవనం వల్ల గర్భవతులైన మహిళలు ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డా.రవిశంకర్, మలేరియా అధికారి ఓబులు, డెమో సిబ్బంది ఉమాపతి,త్యాగరాజు,వేణు,కిరణ్ మరియు జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు మరియు ఎన్సీడీ సిబ్బంది ప్రేమ్, ఆంజనేయులు,కిషోర్, శశి, మౌనిక పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img