Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏపీ వాలంటీర్ వ్యవస్థ తోనే ప్రజలకు న్యాయం చేకూర్చుతున్నది

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : వాలంటీర్ వ్యవస్థ తోనే ప్రజలకు న్యాయం జరుగుతోందని, సచివాలయాల ద్వారా అర్హత గల వారందరికీ కూడా నవరత్నాల పథకం యొక్క లబ్ధి పొందడం జరుగుతున్నదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవ మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం యొక్క వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందించి, దృశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,534 మంది వాలంటీర్లకు రెండు కోట్ల 35 లక్షల మొత్తాన్ని వివిధ సేవలందించినందుకు గాను ప్రోత్సాహ నగదు తో పాటు అవార్డు మెడ్ లను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవా వజ్ర విభాగం ఐదు మందికి ఒక్కొక్కరికి 45,000 చొప్పున మొత్తం 2.25 లక్షలు, సేవా రత్న విభాగంలో 26 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 30,000 చొప్పున మొత్తం 7.80 లక్షలు, సేవా మిత్ర విభాగంలో 1,503 మందికి గాను ఒక్కొక్కరికి 15000 చొప్పున మొత్తము రెండు కోట్ల రెండు లక్షలు నగదును వాలంటీర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజల ముంగిటికే వాలంటీర్లతో సేవలు అందించడం నిజంగా అభినందించదగ్గ విషయమని తెలుపుతూ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వంటి కష్ట కాలములో వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించడం జరిగిందన్నారు. అర్హత గల పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అవినీతికి తా వు లేకుండా, పారదర్శకంగా, సేవాభావంతో, వార్డు వాలంటీర్లు అందిస్తున్నారు అంటే ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న నవరత్నాలతో పాటు వివిధ పథకాల ద్వారా రెండు కోట్ల 50 లక్షల కోట్లు ద్వారా నేరుగా ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం సచివాలయ వ్యవస్థ తోనే సాధ్యమైంది అని తెలిపారు. ప్రతిపక్షాలు తాము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేకనే బురద చల్లడం సరైన పద్ధతి కాదని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాములో కండువా కప్పుకుంటేనే పథకం పేదలకు అందిస్తామని వేధించే వారని తెలిపారు. జగనన్న ఇప్పటికీ 125 సార్లు బటన్ నొక్కి పేదలకు సాయం అందించడం ప్రజలు మరిచిపోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, బత్తలపల్లి ఎంపీపీ త్రివేణి, తాడిమర్రి ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఎంపీడీవోలు మమత, శివ నాగ ప్రసాద్, మని మంజరి, నాగ శేషాచలం రెడ్డి,వైస్ ఎంపీపీ పాటిల్ చిన్న కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోటిరెడ్డి బాల్రెడ్డి, సచివాలయ కన్వీనర్లు మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి, మండల కన్వీనర్లు ఇందుకూరు నారాయణరెడ్డి, జయరాంరెడ్డి తోపాటు పట్టణంలోని కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img