Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అర్జీలను వేగంగా పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అర్జీలను స్వీకరించారు.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డిఎల్డిఓ ఓబులమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 450 అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ అర్జీలను ఎలాంటి ఆలస్యం కాకుండా సకాలంలో వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. నాణ్యతగా అర్జీలను పరిష్కరించడం అత్యంత కీలకమని, రీఓపెన్ కాకుండా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. పెండింగ్ ఉన్న అర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, వెప్మా పీడీ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, ఎల్డిఎం సత్యరాజ్, డీపీఓ ప్రభాకర్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ డా. పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్, హెచ్ఎన్ఎల్ఎస్ ఎస్ఈ దేశే నాయక్, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆర్అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డిటిడబ్ల్యువో రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, స్పందన తహసీల్దార్ మారుతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు బాలాజీ, పుణ్యవతి, ఈశ్వరయ్యశెట్టి, విశ్వనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img