Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు

: జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : ఎన్నికల కమీషన్ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు అన్ని ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలలోకి అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు బ్యారీ కేడింగ్ చేపట్టాలన్నారు. జేఎన్టీయూలో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటి ఫీడింగ్ అంతా పోలీసు కంట్రోల్ రూమ్ లో వచ్చేలా చూడాలని, జిల్లా ఎస్పీ అక్కడి నుంచి మానిటర్ చేస్తారన్నారు. కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు అన్నీ వెంటనే మొదలుపెట్టి పక్కగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూములు తడవకుండా టార్ఫాలిన్ ఏర్పాటు చేయగా, వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లకు సీటింగ్ ఏర్పాటు, ఏజెంట్లకు కూర్చునేందుకు ఏర్పాట్లు, టవర్ ఏసీల ఏర్పాట్లు సకాలంలో చేయాలన్నారు. కాన్ఫరెన్స్ హాల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరు సెల్ ఫోన్స్, సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు, లాంటివి తీసుకెళ్లకుండా పకడ్బందీగా చెకింగ్ చేయాలని, ఆల్కహాల్ బ్రీత్ చెకింగ్ కూడా పరిశీలించాలన్నారు. ఐడి కార్డు లేకుండా ఎవరిని అనుమతించరాదని, వాహనాల అనుమతి కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు. క్యాండిడేట్ / ఎలక్షన్ ఏజెంట్ రూమ్ కి అభ్యర్థులు ఎప్పుడైనా రావచ్చని, ఏజెంట్లకు షిఫ్ట్ ల వారిగా ఐడి కార్డులు కేటాయించడం జరిగిందని, వారు వారికి కేటాయించిన షిఫ్ట్ లలోనే ఎలక్షన్ ఏజెంట్ రూమ్ ని విజిట్ చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడం చేయాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జేఎన్టీయూ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు పటిష్టంగా కొనసాగించాలని, 24/7 బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ కోసం భద్రత, బ్యారికేడింగ్ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తిచేయాలని, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, అడిషినల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, నోడల్ అధికారులు అప్పాజీ, ఓబుల్ రెడ్డి, గురుస్వామిశెట్టి, డీఎస్పీ మునిరాజు, సిఐలు రెడ్డప్ప, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img