576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఈరోజు బ్రహ్మసముద్రం పోలీసులు పోలేపల్లి పోలీస్ చెక్ పోస్టు వద్ద ఒకర్ని అరెస్టు చేసి 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పరశురాముడు మరియు సిబ్బంది ఆ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా… గోవిందయ్య దొడ్డి గ్రామానికి చెందిన రాజశేఖర్ కర్నాటక నుండీ ద్విచక్ర వాహనంపై జిల్లాలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసి 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.