Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లాలో అట్టహాసంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం

: పాలసేకరణను వేగవంతంగా చేపట్టాలి
జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద మంగళవారం ఉదయం జిల్లాలోని అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, రాప్తాడు, నార్పల మండలాల్లోని 98 గ్రామాల్లోని 98 ఏఎంసియులు, 2 బిఎంసియులలో పాలసేకరణ ప్రారంభించడం జరిగింది. బుక్కరాయసముద్రం మండలంలోని కొర్రపాడు గ్రామంలో, రాప్తాడు మండలంలోని హంపాపురం గ్రామంలో జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను తెల్లవారుజామున జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ఏఎంసియులలో సర్పంచులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను వేగవంతంగా చేపట్టాలన్నారు. పాల ఉత్పత్తిదారులకు ప్రామాణికమైన ధరలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, రాప్తాడు, నార్పల మండలాల్లోని 98 ఏఎంసియులు, 2 బిఎంసియుల ద్వారా పాలసేకరణ ప్రారంభమైందని తెలిపారు. 5 మండలాల పరిధిలో 8 వేల 9 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఈరోజు ఉదయం దాదాపు 335 మంది రైతుల నుంచి 1,879 లీటర్ల పాలను సేకరించడం జరిగిందన్నారు. రాప్తాడు మండలంలో ప్రత్యేకాధికారి మరియు జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి ఆధ్వర్యంలో, ఆత్మకూరు మండలంలో ప్రత్యేకాధికారి మరియు డీఆర్డీఏ పిడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, బుక్కరాయసముద్రం మండలంలో ప్రత్యేకాధికారి మరియు పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, నార్పల మండలంలో ప్రత్యేకాధికారి మరియు డిసిఓ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, అనంతపురం మండలంలో ప్రత్యేకాధికారి మరియు డిఎల్దిఓ ఓబులమ్మ ఆధ్వర్యంలో పాలసేకరణను జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రారంభించడం జరిగిందన్నారు. పాలసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతిరోజు అమూల్ ద్వారా ఆయా గ్రామాల్లో ఉదయం, సాయంత్రం పాలసేకరణ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img