Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడు అతుల్ కుమార్ అంజన్

అతుల్ కుమార్ అంజన్ చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర అనంతపురం (వైద్యం) : గత 12 ఏళ్లలో 2.14 లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలే కారణమని కుండబద్ధలు కొట్టి చెప్పే సిపిఐ అగ్రనేత, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ కంఠం మూగబోయిందని సి పి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున మరణించిన అతుల్ కుమార్ అంజన్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సి.మల్లికార్జున అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సి పిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ… వ్యవసాయ కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ల కడుపు నింపడంలో అటు యూపీఏ అయినా ఇటు ఎన్డీఏ అయినా ఒకటేనని అతుల్ కుమార్ పలు ఉద్యమాలలో చెప్పడం జరిగిందన్నారు. అతుల్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందడం పట్ల సిపిఐ పార్టీకి మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి అతూల్ కుమార్ అంజన్ సుదీర్ఘకాలం అఖిల భారత కిసాన్ సభకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం పోరాడిన యోధుడు అని పేర్కొన్నారు. రైతుల తల రాతలు మారాలంటే గిట్టుబాటు ధరలకు చట్టభద్దత కల్పించాలని డా “స్వామినాధన్ కమిటీలో సభ్యునిగా ప్రభుత్వానికి మేలైన సిఫార్సులు చేశారన్నారు . నరేంద్రమోది తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు అతుల్ కుమార్ అంజన్ . రైతులకు పది వేల రూపాయలు పెన్షన్ కోసం చివరిదాకా పోరాడారు అన్నారు . వారి ఆశయాలను సాధించడం కోసం పోరాడటమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

1953లో లక్నోలో జన్మించిన అతుల్ కుమార్ లక్నో స్టేట్ బోర్డ్ స్కూల్ లో ప్రాధమిక . 1967, 1972, 1976, 19835 వరుసగా లక్నో విశ్వవిద్యాలయంలోనే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బి కూడా చేశాడు. 1978 నాటికి అంజన్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్- ఏఐఎస్ఎఫ్- ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. రామకృష్ణ, జిల్లా కార్యదర్శి టి నారాయణస్వామి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, లింగమయ్య,రమణయ్య, అలిపిర, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, రమణయ్య, వంశీ, హనుమంతు,హరి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్, వి. కృష్ణుడు, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img