Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిపిఆర్ పై అవగాహన సదస్సు

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రతి పౌరుడు ప్రాణ రక్షకుడు అనే నినాదంతో అవగాహన సదస్సు
విశాలాంధ్ర- అనంతపురం : గుండెపోటు ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఈమధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. చికిత్స అందించడం ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణమార్గం సి పి ఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. శనివారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్. కె.యస్. యస్. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ….సి పి ఆర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉదాహరణకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షిల్లాంగ్ లోని ఏఐఎం లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ హఠాత్తుగా మధ్యలో కుప్పకూలిపోయారు అని పేర్కొన్నారు . వెంటనే అక్కడివారు ఎవరు ఆయనకు సిపిఆర్ చేయలేదు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాం ను స్థానిక బెతాని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్వర్గస్తులైనారు అని తెలిపారు. ఒకవేళ అబ్దుల్ కలాం గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే సి పి ఆర్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కాబట్టి సిపిఆర్ ఒక ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి పౌరుడు దేశ రక్షకుడు అనే నినాదంతో ఐ ఆర్ సి ఎఫ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ సి పి ఆర్ వీక్ జూలై 21వ తారీకు నుండి 28వ తారీకు వరకు దేశమంతటా సిపిఆర్ యొక్క ఆవశ్యకతను ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు అని పేర్కొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సిపిఆర్ అవగాహన సదస్సును ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హౌ సర్జన్స్, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, సెక్యూరిటీ, శానిటేషన్,నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ఎలక్ట్రీషియన్స్,ఎమ్ ఎన్ ఓ,ఎఫ్ ఎన్ ఓ తదితర వైద్య సిబ్బంది అందరికీ నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ కే ఎస్ ఎస్ వెంకటేశ్వర రావు గారు, ఎనస్తీషియా ప్రొఫెసర్ డా.ఏ . నవీన్ కుమార్ , డి సి ఎస్ ఆర్ ఎం ఓ డాక్టర్ వి.పద్మజ డాక్టర్ జి.హేమలత, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరుల్లా ఖాన్, డాక్టర్ ఎం .సునీత మరియు ఎనస్తీష వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img