Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బ్యాక్టీరియా తెగులు నివారణకు మేలైన యాజమాన్య పద్ధతులు..

ఉద్యాన శాఖ అధికారిని అమరేశ్వరి
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు 770 హెక్టార్ల విస్తీర్ణంలో దానిమ్మ సాగులో ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు బ్యాక్టీరియా తెగులు వ్యాపించడంతో, ప్రస్తుతం పూతదశ నుండి పిండి దశలో ఉన్న తోటల్లో బ్యాక్టీరియా తెగుల నివారణ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన శాఖ అధికారిని అమరేశ్వరి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెగులు నివారణ ఉపాయాలలో భాగంగా బ్యాక్టీరియా తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తొలగించి, తోట బయట కాల్చివేయాలన్నారు. రోగము సోకిన కొమ్మలను రెండు ఇంచులు కిందకు కత్తిరించి కాల్చివేయాలని, తదుపరి ఒక శాతం బోర్దో మిశ్రమం పిచాకారి చేయాలని తెలిపారు. 15 రోజుల తర్వాత రెండవసారి కూడా పిచికారి చేయాలని, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు వ్యాప్తి జరగకుండా జీవ సిలేంద్ర నాశిని, సుడోమోనాస్ 5 మిల్లీలీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలన్నారు. డ్రిప్పు ద్వారా నీరు రోజు విడిచి రోజు గంటన్నరకు మించి ఇవ్వరాదని, నత్రజని సంబంధిత ఎరువుల వాడకమును తగ్గించి, వేపచెక్క, కానుగ చెక్క వంటివి చెట్టుకు 2 కిలోలు చొప్పున వేయాలన్నారు. పై విధంగా రైతులు తెగుల నివారణలో చేయడం వలన రైతులు నష్టపోయే అవకాశం ఉండదని తెలిపారు. రైతులందరూ పై నివారణను చక్కగా అమలుపరిచి, అధిక దిగుబడులు తేవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img