Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు ఆశయ సాధనాలకు కృషి చేయాలి

ఏపీ రైతు సంఘం జిల్లా సమితి

విశాలాంధ్ర – ధర్మవరం : భూ పోరాటయోధుడు సాగునీటి ప్రాజెక్టుల సాధకుడు కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు ఆశయాలను కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యాలయంలో వారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి రమణ, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాషలు మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు రైతులు రైతు కూలీల ప్రయోజనాల కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని చర్లపల్లి జమీందారు మిగులు భూములు పంచడంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు, దాసరి నాగభూషణ్ రావు తో కలిసి అనేక పోరాటాలు చేసి పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత వారికే దక్కిందని తెలిపారు. నూజివీడు ప్రాంతంలో జరిగిన అనేక భూ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులపై ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని వారు పరితపించడం జరిగిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై జలదర్శిని అనే పుస్తకాన్ని రచించి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులపై అవగాహన కల్పించారని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఈ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందుతుందని వారు తెలపడం జరిగిందని తెలిపారు. ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతులమీదుగా జలధర్శని పుస్తకాన్ని ఆవిష్కరించి దాని విశిష్టతను వారు కొనియాడడం జరిగిందని తెలిపారు. మాన్సంటో కంపెనీ బిటి పత్తి విత్తనాల ధరలను విపరీతంగా పెంచి, రైతులను దోచుకుంటున్న సమయంలో ఆ కంపెనీపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేసి ధరలు తగ్గించి రైతులకు ప్రయోజనం చేకూర్చడం జరిగిందని తెలిపారు. రైతులు, రైతు కూలీల ప్రయోజనాల కోసం చివరిదాకా పోరాడి అసువులు బాసిన అమరులు కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ మారుతి, నామాల నాగార్జున, రమణ, గుర్రం వెంకటస్వామి, జంగమన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img