Friday, April 19, 2024
Friday, April 19, 2024

అక్రమంగా మద్యం తరలించే వారిపై ఉక్కుపాదం

డిఎస్పీ వెంకటశివారెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు రాప్తాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలచెర్ల గ్రామ సమీపంలో పేరూరు గ్రామానికి చెందిన బోయ రాకేష్ , గుడుసాల మనోహర్, జి.మహేష్ అనే వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని పక్కా సమాచారం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పాలచెర్ల సమీపంలో రాప్తాడు సీఐ డి.మునిస్వామి, పోలీసు సిబ్బందితో కలిసి పక్కాగా సమాచారంతో కాపు కాసి ఏపీ02టీహెచ్ 2832 నంబరు గల బొలెరో వాహనంతోపాటు అందులో తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని స్టేషనుకు తరలించామన్నారు. అందులో ఉన్న రూ.87,360 విలువ చేసే 13 కేసుల 90ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img