Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

క్రమశిక్షణతో కూడిన విధులను నిర్వర్తిస్తే విజయం తప్పక వరిస్తుంది..

ఆర్డీవో తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న

విశాలాంధ్ర -ధర్మవరం : క్రమశిక్షణతో కూడిన విధులను నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరికి విజయం వర్తిస్తుందని ఆర్డిఓ తిప్పేనాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ భవనంలో పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, తాసిల్దారులకు ఁఇంటింటా ఓటు సర్వేపైఁసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రకటించిన షెడ్యూల్ తేదీలోగా ఇంటింటా ఓటరు రీ సర్వే పూర్తిచేసే ప్రగతిపై వారు ఆరా తీశారు. పట్టణ ప్రాంతంలో ఈ ఓటు రి సర్వే కార్యక్రమం ఇప్పటికే 50 శాతం పూర్తి అయిందని, గ్రామీణ ప్రాంతాలలో కొన్నిచోట్ల ఇంతవరకు ప్రారంభించకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు సమస్యలు తెలపకుండా ఓటు సర్వేలు నిర్వహించకపోవడానికి గల కారణాలపై వారు ఆరా తీశారు. సమావేశాలకు కూడా సమయపాలన పాటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ,, సమావేశాలకే ఆలస్యంగా వస్తే, తమ విధుల పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుందని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందే విధంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ఎన్నో సూచనలు కూడా రావడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈనెల 21వ తేదీ లోపల మొత్తం ఇంటి సర్వే పూర్తి చేయాల్సిన బాధ్యత బిఎల్ఓ లది, సూపర్వైజర్ దేనని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సూపర్వైజర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇంత అశ్రద్ధ ఉండడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటివరకు ఇంటింటా రీ సర్వేలపై ఎటువంటి ప్రగతి వివరాలు ఇవ్వని సూపర్వైజర్ల పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా సమావేశము యొక్క సమాచారాన్ని బిఎల్వోలకి తెలిపిన కూడా వారు రాకపోవడం ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించినట్లేనని, రానీ బిఎల్ఓ లకు మెమోలు జారీ చేసి, సంజాయిషిని అడగాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వచ్చే ప్రతి అంశము, సమాచారము తప్పక అమలు పరచాలని లేనియెడల సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఓటర్ సర్వే ను పారదర్శకంగా తప్పనిసరిగా చేయాలని, ఎక్కడా ఎటువంటి లోపాలు, అవక తవకలు లేకుండా చూడాల్సిన బాధ్యత బిఎల్వోలది, సూపర్వైజర్ దేనని వారు తెలిపారు. సమయం యొక్క విలువ ఎంతో గొప్పదన్న విషయాన్ని బిఎల్వోలు, సూపర్వైజర్లు గుర్తించాలని సూచించారు. నెట్టు రావటం లేదని, సర్వర్లు పనిచేయడం లేదన్న అవరోధాలను అధిగమించడానికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శక అంశాలను కూడా తెలపడం జరిగిందని, వెంటనే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫారం-6,7,8 లలో నాణ్యత, అర్హత తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సాధారణ నివాసం ఉన్న వారికే ఓటు హక్కు ఉంటుందని, నివాసము ఒకచోట, ఉద్యోగం ఒకచోట ఉన్న వారి జాబితాను వెంటనే తయారుచేసి మాకు పంపితే కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, డబుల్ ఓటింగ్ ఉండరాదని, చేర్పులు, మార్పులు, మృతి చెందిన వారిని తొలగించుట లాంటి విషయాలలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత బిఎల్ఓలదేనని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బోగస్ ఓట్లకు తావు ఇవ్వరాదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజకుమార్, పట్టణ, గ్రామీణ బిఎల్ఓ లు, తహసిల్దార్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img