విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణం శివరామిరెడ్డి కాలనీ లో నివాసం ఉంటున్న హరిజన గంగన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందికి గురవుతుండడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేశవ్ మరియు ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆదేశించడంతో గురువారం 10వేలు రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు మాజీ రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగటి నాగరాజు, మండల కన్వీనర్ విజయభాస్కర్, పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు, తిమ్మప్ప,వైస్ ఎంపీపీ రాజేష్, వరప్రసాద్, ఆనంద్, సుదర్శన్, వార్డ్ మెంబర్ రామాంజనేయులు, సుధాకర్,మెపిడి గోపాల్, శీన గోపాల్ , తెలిపారు.