ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు నాగ రత్న
విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని దుర్గా నగర్ లో గల వృద్ధాశ్రమంలోని మహిళలందరికీ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు నాగరత్న ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని హోలీ పండుగ దినోత్సవ సందర్భంగా పంపిణీ చేశారు. అనంతరం అధ్యక్షురాలు నాగరత్న మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో సేవలను మరింత విస్తరింప చేస్తామని, మా అండ దండలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. తదుపరి అక్కడ ఉన్న వృద్ధుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోలీ పండుగను ఈ ఆశ్రమంలో జరుపుకోవాలని మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, కళ, గాయత్రి, పర్వీన్, లక్ష్మి, చంద్రిక, పుష్పలత, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.