Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బిజెపిలో చేరిన రాష్ట్ర తొగట వీర క్షత్రియ సంఘం ఉపాధ్యక్షులు

విశాలాంధ్ర – ధర్మవరం:: ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన చేనేత నాయకుడు, రాష్ట్ర తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనాల మారుతీ గోవింద ప్రసాద్ విజయవాడలో జరిగిన బిజెపి పదాధికారుల సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు తాను ఆకర్షితులై అదేవిధంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికై తాను బిజెపిలో చేరడం జరిగిందని, బిజెపి అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకై తన సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img