Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

సూపరి పాలనతో ప్రజల ఆదరణ పొందాము

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రములో సుపరిపాలన అందించి రాష్ట్ర ప్రజల ఆదరణ పొందడం జరిగిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పట్టణంలోని 16వ 20వ వార్డులకు సంబంధించిన దాదాపు 325 కుటుంబంలోని వారందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం 16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్, 20వ వార్డు మేడాపురం సూరి ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఐదు సంవత్సరాలుగా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ, ముఖ్యమంత్రి మంచి పాలన అందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా దాదాపు 90 శాతము అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని, ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడం జరిగిందని, మరిన్ని పనులు చేయాల్సి ఉందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు తాను చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్రెడ్డి, నీలూరి ప్రకాష్, గోరకాటి పురుషోత్తం రెడ్డి, తోపుదుర్తి వెంకటరాముడు, జిలాన్ భాష ,శంకర్ యుగంధర్, బే రే కేశవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img