Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నేత్రదానం చేసి, మరో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించండి

యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు.. వై కే శ్రీనివాసులు, సుంకు సుకుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : నేత్రదానం చేసి మరో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించే అవకాశం ఉందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, కార్యదర్శి సుంకు సుకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన వారు నేత్ర దానాలు చేస్తే మరో ఇద్దరికి ప్రపంచంలో కంటి వెలుగును ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు. ఇప్పటికే నేత్రదానంపై అనేకచోట్ల అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాలుగా తాము 200 మంది తో నేత్రధానాన్ని స్వీకరించి, వారం రోజుల లోపులే మరో ఇరువురికి కంటిని అమర్చి, కంటి వెలుగును ప్రసాదించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి కుటుంబంలో కూడా నేత్రదానంపై తప్పక అవగాహన చేసుకోవాలని, ఇప్పటికే జిల్లాలో యువసే ఫౌండేషన్ సంస్థ అగ్రగామిగా నిలవడం గర్వంగా ఉందని తెలిపారు. కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఎనిమిది గంటల లోపు మాకు సమాచారాన్ని ఇస్తే నేత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్.. 9441184004 లేదా 9396780147 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img