Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చును

మున్సిపల్ చైర్మన్.. కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : రక్తదానంతో సకాలంలో ప్రాణాలను కాపాడవచ్చునని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మూడో వార్డు శాంతినగర్ లో శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయం దగ్గర శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి వారు ముఖ్య అతిథిగా హాజరై వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల చౌడేశ్వరి దేవి సేవా సమితి నిర్వాహకులను వారు అభినందించారు. ప్రతి వ్యక్తి తన రక్తాన్ని ఆపద సమయంలో గానీ, రక్తం అవసరం ఉన్నప్పుడు గానీ ఇస్తే ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగిన వారు అవుతారని తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి 70 మంది రక్తదాతలు రక్తం ఇవ్వడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఇటువంటి శిబిరాలను మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. అనంతరం చైర్మన్ కాచెర్ల లక్ష్మిని, మాజీ చైర్మన్ భాగ్యలక్ష్మిని సేవా సమితి వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, టూ టౌన్ సీఐ రాజా, వైఎస్ఆర్సిపి నాయకులు కాచర్ల అంజి, సిద్ది రాజేష్, చింతా మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు కేత లోకేష్ నీలూరి వెంకటరాముడు, మూడవ వార్డు కౌన్సిలర్ శంకర తేజేశ్వర్, శంకర యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img