Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డి.ఎస్.పి వి ఎస్ కే చైతన్యను సస్పెండ్ చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర- అనంతపురం : పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన హింసాత్మక సంఘటనలపై పోలీసులు విఫలం చెందారని దీనికి బాధ్యులైన డి.ఎస్.పి వి ఎస్ కే చైతన్య వెంటనే సస్పెండ్ చేయాలని సి పి ఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్ చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాడిపత్రి సంఘటనలో తీవ్రంగా గాయపడిన దాసరి కిరణ్ పరామర్శించడానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సూపర్డెంట్ తో మాట్లాడి విషయం తెలుసుకొని తాడిపత్రిలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్తుంటే ముందస్తుగా సిపిఐ జిల్లా సమితి నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో గాయపడిన వారిని పరామర్శించడం సిపిఐ పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయం, ఇండ్లలో విచక్షణ రహితంగా పోలీసులు దాడులు చేయడంపై జిల్లా ఎస్పీ, డీఐజీలను వివరణ కోరగా అసలు డీఎస్పీ చైతన్య ను మేము అధికార పూర్వకంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జిల్లాలో తాడిపత్రి సంఘటన నియంత్రించకపోతే పలుచోట్ల ఇటువంటి సంఘటన పునరావృతం అవుతుందని భావిస్తున్నామన్నారు. వెంటనే ఎస్పీ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శిలు పాల్యం నారాయణస్వామి, శ్రీ మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సి.లింగమయ్య,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. A

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img