London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ముగిసిన ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు..

శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయ చెలిమి జీర్ణోదరణ సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మాధవ నగర్ కెపిటి స్ట్రీట్ చెలిమి వద్ద ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ సీతారామ లక్ష్మణ పంచముఖ ఆంజనేయ స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు శుక్రవారం ఉదయము కలశ పూజ, విగ్రహ ప్రాణ ప్రతిష్ట, పంచామృతాభిషేకం, అలంకరణ అష్టోత్తర నామ పూజలు, ప్రాతఃదీక్ష హోమము, కల్యా నోసా, శేష హోమాలు, కలశ ఉద్వాసన దేవత దృష్టి దర్పణ గోదర్శన జ్వాల, బలిహరణ, కుసుమండక్షేదన పూజ లను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడిమ సాంప్రదాయ పద్ధతిలో ప్రధాన అర్చకులు మోహన్ స్వామి, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని వివిధ పూలతో ప్రత్యేక పూజలను వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు, భక్తాదులు ఆలయ కమిటీ నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. శిఖర కలశ స్థాపనకు, మూలవిరాట్ విగ్రహాలకు వివిధ పూలలతో అలంకరించి ప్రత్యేక పూజలను, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగిందని ఆలయ గౌరవాధ్యక్షులు గడ్డం పార్థసారథి, పళ్లెం వేణుగోపాల్, సోలిగాళ్ళ వెంకటేశులు, అధ్యక్షులు బండారు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సుందరేషన్, కార్యదర్శి పామయ్యగారి లక్ష్మీనాత్ తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా వందలాదిమంది భక్తాదులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహకార దర్శి కోటం హేమంత్ కుమార్, కోశాధికారి వెంకట నరసింహులు, సహా కోశాధికారులు నాగభూషణం, రంగనాయకులు, సహకోశాధికారులు నాగభూషణం మామిళ్ళ రంగనాయకులు, సహా అర్చక బృందం భరద్వాజ, ప్రసాద్ శర్మ, రవి స్వామి, రాజశేఖర్, ఫణి కుమార్ శర్మ, గణేష్, లక్ష్మీపతి శర్మ, సుమంత్ కుమార్, ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img