Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు నిలువరించాలి..

విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలు, ఫీజుల నియంత్రణ

పుస్తకాల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు

విశాలాంధ్ర- జేఎన్టీయూఏ: అనంతపురం నగరంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిలువరించాలని, నగరంలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలు తొలగించాలని శనివారం ఏఐఎస్ఎఫ్ అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, ఉమా మహేష్ మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి ముందస్తుగా అడ్మిషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. నగరంలో ప్రధాన కూడలిలో సీబీఎస్సీ పేరుతో పర్మిషన్లు లేకపోయినా కూడా పెద్దపెద్ద హోల్డింగ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను నగరంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఏమాత్రం పాటించకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో కొన్ని స్కూళ్లకు పర్మిషన్లు తెచ్చుకొని ఐదు నుంచి పది బ్రాంచ్ లు నడుపుతున్నారని తెలిపారు. తక్షణమే అనుమతులు లేకుండా నడుపుతున్న బ్రాంచ్లను సీస్ చేయాలని డిమాండ్ చేశారు. ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు నగర ప్రధాన కూడలిలో భారీ హోల్డింగ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 2024 -25 విద్యా సంవత్సరం సం.. అడ్మిషన్లు ప్రారంభించామని ఫ్లెక్సీలలో బహిరంగంగా ఏర్పాటు చేసినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్లో స్కూలు , హాస్టలు అనుమతులు లేకపోయినా నగరంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు విద్యాసంస్థల పేర్లతో ముద్రించిన పుస్తకాలను 6000 నుంచి 12 వేల రూపాయల వరకు కార్పొరేట్ విద్యాసంస్థలు అమ్ముతున్నారని తెలిపారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి నగరంలో ఏర్పాటుచేసిన విద్యాసంస్థల ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు చందు నగర ఉపాధ్యక్షులు హరికృష్ణ రారాజు సహాయ కార్యదర్శులు వంశీ హర్ష నాయకులు ప్రసన్న సునీల్ ప్రశాంత్ జగదీష్ ఉమా తదితరులు పాల్గొన్నారు.

01.. డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img