Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉపాధి కూలీలను అన్ని విధాల ఆదుకోవాలి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని, కూలీలకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం ఉరవకొండ నియోజకవర్గం ఉండబండ గ్రామంలో ఉపాధి కూలీలు వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని, దానిలో భాగమే బడ్జెట్‌లో నిధులు కోత కోశారని పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు పని ద్రేశాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, టెంట్లు వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్రం పేదల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీకి అందిస్తున్నారని పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. పని చేసిన కూలీలకు తక్షణమే
బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పనిచేసే కూలీలకు పలుగు, పారా, తట్టా, తాగునీటికి డబ్బులు చెల్లించాలని, మెడికల్‌ కిట్టు, పే స్లిప్పులు మంజూరు చేయాలని, పని చేసే ప్రతి గ్రూపునకు పనిముట్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని కూలీలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పని దినాలు పెంచాలని తదితర అనేక డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నామన్నారు. అందులో భాగంగా ఆగస్టు చివరి వారంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో వ్యవసాయ కార్మిక సంఘం 23 వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభలలో అనేక తీర్మానాలు చేసి కూలీలు పక్షాన పోరాటాలుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, మహిళా సంఘం నాయకురాలు వన్నూరమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img