London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నా భూమి-నా దేశం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మనందరం స్మరించుకోవాలి

జిల్లా కలెక్టర్ యం. గౌతమి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ యం. గౌతమి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో నిర్వహించిన హెరిటేజ్ వాక్ లో జిల్లా కలెక్టర్ యం. గౌతమి, డిఐజి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్ జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల వద్ద పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్పర్సన్, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మనందరం స్మరించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన రాబోతున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగఫలం వల్ల మనము స్వాతంత్రం అనుభవిస్తున్నామని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ పాల్గొనాలన్నారు. ఆనాటి మహనీయులు చూపించిన బాటలో మనమందరం నడస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. మహనీయులకు మనమందరం నివాళులు అర్పించాలని, బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరులు ఇందులో భాగస్వామమై పండగ ఉత్సవంలా నా భూమి-నా దేశం కింద చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నా భూమి-నా దేశం కార్యక్రమాల నిర్వహణకు ఈరోజు నాంది పలుకుతూ హెరిటేజ్ వాక్ ను నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ స్థాయి నుంచి నా భూమి – నాదేశం కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీరులందరికీ నివాళులు అర్పించే విధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో శిలాఫలకాలను ఆవిష్కరించాలన్నారు. పంచాయతీలలో శిలాఫలకాలను ఏర్పాటు చేసి పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేసి, వసుధ వందనంలో భాగంగా మొక్కలను నాటుతూ వీరులందరినీ స్మరించుకుని ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని, దేశభక్తికి ప్రతీకగా ఎందరో మహనీయులు మనకోసం మన భావితరాల కోసం ప్రాణాలను త్యాగం చేశారని, వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తూ రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిలుపుతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను జాతీయ సమైక్యత స్ఫూర్తితో ఎంతో ఘనంగా జరుపుకున్నామన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈరోజు హెరిటేజ్ వాక్ నిర్వహించామన్నారు. నా భూమి నా దేశం అంటూ అందరం ఏకమై దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని, అదే స్ఫూర్తితో 76 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య దేశంగా ముందుకు పోతున్నామని, ఎంతో అభివృద్ధి చెందామన్నారు. భవిష్యత్తులో మనందరం కూడా నా భూమి నా దేశం అంటూ ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ హెరిటేజ్ వాక్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలం వల్లనే మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అలాంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, డీఈవో సాయిరాం, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, డిపిఓ విజయకుమార్, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, పరువులు పుర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img