Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నా భూమి-నా దేశం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మనందరం స్మరించుకోవాలి : సర్పంచ్ సతీష్

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్ సతీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మనందరం స్మరించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన రాబోతున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగఫలం వల్ల మనము స్వాతంత్రం అనుభవిస్తున్నామని, మహనీయులు చూపించిన బాటలో మనమందరం నడస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. మహనీయులకు మనమందరం నివాళులు అర్పించాలని, బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరులు ఇందులో భాగస్వామమై పండగ ఉత్సవంలా నా భూమి-నా దేశం కింద చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నా భూమి-నా దేశం కార్యక్రమాల నిర్వహణకు ఈరోజు నాంది పలుకుతూ నా భూమి – నాదేశం కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీరులందరికీ నివాళులు అర్పించే విధంగా గ్రామ పంచాయతీలో శిలాఫలకాలను ఏర్పాటు చేసి పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేసి, వసుధ వందనంలో భాగంగా మొక్కలను నాటుతూ వీరులందరినీ స్మరించుకుని ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని, దేశభక్తికి ప్రతీకగా ఎందరో మహనీయులు మనకోసం మన భావితరాల కోసం ప్రాణాలను త్యాగం చేశారని, వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తూ రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలవాలన్నారు.
స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా నా భూమి-నా దేశం అనే నినాదంతో వివిధకార్యక్రమాలు చేపట్టటం జరుగుతుందని అన్నారు నా భూమి నా దేశం అంటూ అందరం ఏకమై దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని, అదే స్ఫూర్తితో 76 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య దేశంగా ముందుకు పోతున్నామని, ఎంతో అభివృద్ధి చెందామన్నారు. భవిష్యత్తులో మనందరం కూడా నా భూమి నా దేశం అంటూ ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలం వల్లనే మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అలాంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,ఎంపీటీసీ చౌడబోయిన యానాది,సచివాలయ కన్వీనర్ ఇరుపని అంజయ్య,కార్యదర్శులు అనిల్, రవికుమార్, సచివాలయం సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img