Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎల్డిఎం సత్యరాజ్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, ఆర్డీఓ జి.వెంకటేష్, తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా పాఠశాల, డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ పోటీలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎల్డిఎం సత్యరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పాఠశాల విద్యార్థులకు మరియు డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థిక అవగాహన కల్పించాలన్నదే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈనెల 27వ తేదీన మంగళవారం ఒక మున్సిపల్ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకే చదివే విద్యార్థినీవిద్యార్థులకు చిత్రలేఖనం మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద 2 వేల రూపాయలు, రెండవ బహుమతి కింద 1,200 రూపాయలు, మూడవ బహుమతి కింద 800 రూపాయలను, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు కింద 500 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. 28వ తేదీన బుధవారం మున్సిపల్ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి పాల్గొంటారని, ఇందులో గెలిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి కింద 4 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 3,000 రూపాయలు, తృతీయ బహుమతి కింద 2,000 రూపాయలు, పోటీల్లో పాల్గొన్న రెండు జట్లకు 500 రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ఈనెల 29వ తేదీన పదవినోదము, ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై డిగ్రీ చదివే విద్యార్థులకు (ఇద్దరు విద్యార్థులు ఒక జట్టుగా) పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి కింద 4 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 3,000 రూపాయలు, తృతీయ బహుమతి కింద 2,000 రూపాయలు, పోటీల్లో పాల్గొన్న రెండు జట్లకు 500 రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. అనంతరం మార్చి 1వ తేదీన ఆర్థిక అక్షరాస్య వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతుల ప్రధానం చేయనున్నట్లు ఎల్డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎల్డీఎం కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img