Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

విశాలాంధ్ర- ఉరవకొండ : పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ, సాయి నగర్ లలో రూ.20 లక్షలు ఉపాధి హామీ నిధులతో పాటు మరో 10 లక్షల ఎఫ్ఎఫ్సి నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులోను ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే రూ.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు,డ్రైనేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. అదే విదంగా గడప గడప కార్యక్రమం ద్వారా వచ్చిన మరో కోటి రూపాయలతో అనేక పనులు పూర్తి చేశామన్నారు.ఉరవకొండ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌ను విశ్వేశ్వరరెడ్డి ఆదేశించారు. అధికారులు కూడా నిర్మాణ పనులను తరచూ పర్యవేక్షించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img