London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఉచిత కంటి వైద్య శిబిరమే మా లక్ష్యం.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడమే యువర్స్ ఫౌండేషన్ యొక్క లక్ష్యమని అధ్యక్షులు. వై కే. శ్రీనివాసులు, కార్యదర్శి. సుంకు సుకుమార్, కోశాధికారి రాధాకృష్ణ క్యాంపు చైర్మన్ నామాల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని స్వాతి క్లినిక్ లో శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరము యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, శ్రీ చక్ర హాస్పిటల్- కర్నూల్ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఒక చక్కటి అవకాశం అని, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లముల గలవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ/ ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు చేయబడునని తెలిపారు. కంటి పరీక్షలు చూయించుకునేవారు తప్పకుండా ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గర్జాల పార్వతమ్మ, కీర్తిశేషులు గర్జాల బాల వెంకట రామప్ప వారి జ్ఞాపకార్థం వీరి కుమారుడు గర్జాల అశ్వద్ధ నారాయణ, మనవడు గర్జాల పవన్ కుమార్ , కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా యువర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న నేత్రదాన కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని తెలిపారు. నేత్రదానం చేసి, రెండు జీవితాలలో వెలుగును నింపాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని కంటి వెలుగులు ప్రసాదించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9441184004 లేదా 9396780147కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాధాకృష్ణ, వీఆర్వో జయరాములు, డాక్టర్ బి వి. సుబ్బారావు, చాంద్ బాషా, సింగనమల శివప్రసాద్, రమేష్ బాబు, షీలా నాగేంద్ర, దాత గర్జాల అశ్వత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img