Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఇంటర్మీడియట్ పూర్తి అయిన పేద విద్యార్థులకు ఉచిత పారామెడికల్ కోర్సులు

విశాలాంధ్ర, కదిరి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ అయినా పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు గల వృత్తి వైద్య పారామెడికల్ కోర్సులు తిరుపతిలో అందిస్తున్నట్లు నవ సమాజ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా కేవలం అడ్మిషన్ ఫీజు చెల్లించి ఈ క్రింద పేర్కొన్న కోర్సులు 1.డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్,2డిప్లొమా ఇన్ రేడియాలజీ టెక్నీషియన్,3.
డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్,4.డిప్లమా ఇన్ మెడికల్ స్టేరిలైజెషన్ మేనేజ్మెంట్,
5.డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్,6.డయాలసిస్ టెక్నిషియన్ లో డిప్లొమా ఈ కోర్సులను తిరుపతిలోని ప్రవీణ్ ఇన్సిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ స్ వారి సౌజన్యంతో అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. వివరాలకు 9515194788, 9885950238 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img