Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి

అన్ని పంటలకు బీమాను మంజూరు చేయాలి

విశాలాంధ్ర, కదిరి : రైతాంగ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ వద్ద సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి యస్.కె ఇసాక్ అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించా రు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీ.రమణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ అన్ని పంటలకు బీమాను వర్తింపజేసి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సాగు చేయడానికి విపరీతంగా ధరలు పెరగడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటలు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడి పెట్టాలన్న అనేక మంది రైతులు దగ్గర డబ్బులు లేక వ్యవసాయాన్ని వదులుకొని పక్క రాష్ట్రాలకు కూలీగా వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేకమంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు.తక్షణం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పెట్టుబడి సహాయంగా 13500 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎకరానికి పెట్టుబడి సహాయం కూడా సరిపోదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న తరహాలో ఎకరాకు 10,000 చొప్పున రెండు ఎకరాలకు 20,000 చొప్పున అమలు చేయాలని రాష్ట్రంలో ప్రతి రైతు 2.45 లక్షలు రుణభారం తో ఉన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలలో మన రాష్ట్ర మూడో స్థానంలో ఉంది వీరిలో అత్యధికులు పే,కౌలు రైతులే ఉన్నారని, కనీస మద్దతు ధరలకు కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకో లేని దుస్థితి ఏర్పడినందని రెండు లక్షల రూపాయలు వరకు ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలన్నారు.కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలని, 50 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రతి పంటకు వాతావరణ బీమా వర్తింప చేయాలని, సాగు చేస్తున్న ప్రతి రైతుకు సాగు పట్టాలు ఇవ్వాలని, పాడి పశువులకు బ్యాంకులలో 50% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని, స్పీంకర్స్ ,డ్రిప్ 90% సబ్సిడీతో ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి జయలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్, సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శి రాజేష్, రైతు సంఘం సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడాల గొంది రమణ, ఏఐటీయూసీ ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ మధు నాయక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చౌడప్ప, సిపిఐ డివిజన్ నాయకులు హాసాన్, సిద్దయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మనోహర్, రమేష్ బాబు, శంకర, భాను, శాంత, ఇమాంభి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img