Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహిళా సాధికారతకు కృషి చేయాలి
ఆడపిల్లలు బాగా చదువుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గురువారం ఏపీజేఏసీ, అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళకంటూ ఒకరోజు కేటాయించడం జరిగిందని, మహిళ అయినా ఉద్యోగం, కుటుంబం, పిల్లలు ఏం చేస్తుంటారు అనేది మెదడులో రన్ అవుతూ ఉంటుందన్నారు. కుటుంబంలో మహిళకు తల్లి సహకారం అవసరమన్నారు. మహిళల అభివృద్ధికి సాధికారత అవసరమని, ప్రతి ఒక్క మహిళ చక్కగా చదువుకోవాలన్నారు. విద్య అనేది స్వేచ్ఛ ఇస్తుందని, ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, ఇందుకోసం కష్టపడి పని చేయాలన్నారు. మహిళలకు కుటుంబం కూడా ఎంతో ముఖ్యమని, వారు అభివృద్ధి చెందేందుకు భర్త, కుటుంబ సభ్యుల సహకారం అవసరమని, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు చాలా సవాళ్లు ఎదురవుతాయని, అందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని, చాలా బలంగా నిలబడాలన్నారు. పిల్లలు, కుటుంబం, పని ఒత్తిడి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రతిరోజు కొత్త అంశాలు నేర్చుకోవాల్సి వస్తుందని, అందరితో కలిసిమెలిసి ఉంటూ ముందుకు వెళ్లాలన్నారు. మహిళలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, వారి కోసం కొంత సమయం కేటాయించుకోవాలని, వారి లక్ష్యాలను సాధించుకునేందుకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, మహిళా అధికారులు ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నివారణకు కృషి చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణ అంశంపై చర్చించాలని, బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలన్నారు. బాలికలందరినీ ఉన్నతంగా చదివించాలని సూచించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, మెప్మా పిడి వేణుగోపాల్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఎల్డివో ఓబులమ్మ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, అమరావతి ఏపీజెఎసి ఉమెన్ వింగ్ చైర్పర్సన్ సురేఖరావు, జనరల్ సెక్రెటరీ కృష్ణవేణి, ట్రెజరర్ నీరజాక్షి, అమరావతి ఏపీజెఎసి మెన్స్ వింగ్ చైర్ పర్సన్ దివాకర్ రావు, జనరల్ సెక్రెటరీ పిఎస్ ఖాన్, కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img