Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఘనంగా గణాంకాల దినోత్సవం .. కళాశాల ప్రిన్సిపాల్ ఫణి కుమార్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో గురువారం గణాంకాల దినోత్సవం ను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పని కుమార్ కళాశాల డైరెక్టర్ అక్రమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణాంకాల శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాల నోటీస్ జయంతి వేడుకలను జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మానవుని జీవితములో గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను డైరెక్టర్, ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం గణాంకాల శాస్త్రంలో నూరు మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చాంద్ బాషా, డైరెక్టర్ లు, అధ్యాపకులు జితేంద్ర, చంద్రిక, కీర్తి ప్రియ, అల్తాఫ్ తో పాటు కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img