Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

హెచ్.ఐ.వి. ఆన్ లైన్ రిపోర్ట్ లపై ల్యాబ్ టెక్నీషియన్లు శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే హెచ్.ఐ.వి. పరీక్షల యొక్క నెలవారి నివేదికలను ఎస్ ఒ సి హెచ్ అనే ఆన్ లైన్ పోర్టల్ నందు ప్రతినెలా క్రమం తప్పకుండా అప్లోడ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్ లకు పీహెచ్ సి లు, యూపీహెచ్ సి లలో నిర్వహించే హెచ్. ఐ. వి. పరీక్షల వివరాలు ప్రతినెల నమోదు చేయవలసిన రిపోర్టులకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం మంగళవారం అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ… ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో హెచ్ఐవి కి సంబంధించి కేవలం స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నామని, నిర్ధారణ పరీక్షలు దగ్గరలోని స్టాండ్ అలోన్ ఐ.సి.టి.సి లో నిర్వహిస్తారని స్క్రీనింగ్ లో పాజిటివ్ వచ్చినవారిని దగ్గరలోని స్టాండ్ అలోన్ ఐ.సి.టి.సి. కి వెళ్లే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఫాలో అప్ చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ… శిక్షణ కార్యక్రమానికి హాజరైన అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిపోర్టులు పంపటం లో ఎటువంటి అనుమానులున్నా ఇక్కడే అడిగి నివృత్తి చేసుకోవాలని, ప్రతి ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది నెలవారీ నివేదికలను సమయానికి అందజేయాలని తెలిపారు.
జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో ప్రతి నెల దాదాపు 17 వేల మందికి హెచ్. ఐ. వి. పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ వివరాలు ఎస్ ఒ సి హెచ్ పోర్టల్ లో రిపోర్ట్ చేయాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశించిందని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎఫ్ పి సి నోడల్ అధికారి డాక్టర్ సుజాత, ఎన్ హెచ్ ఎం డీపీఎం ఒ డాక్టర్ చెన్నకేశవులు, ఎన్ సి డి – సిడి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నారాయణ స్వామి, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ సుకుమార్, డిప్యూటీ హెచ్ ఈ ఒ గంగాధర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డి.పి.ఎం. వెంకటరత్నం, జిల్లా సూపర్వైజర్ జి.వి. రమణ సిబ్బంది మురళి, నారాయణ స్వామి, పి ఎఫ్ ఒ ఈ. వి.రమణ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్లు ఐ.సి.టి.సి. మరియు సుఖ వ్యాధి చికిత్స కేంద్రాల కౌన్సిలర్లు, ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్టు మేనేజర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img