Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సింగిల్ ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవు..

శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా
విశాలాంధ్ర -ధర్మవరం : సింగిల్ ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కమిషనర్ బండి శేషన్న ఆదేశాల మేరకు పట్టణములో పలుచోట్ల దాడి నిర్వహించారు. ఇందులో భాగంగా పోతుకుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గల దుకాణాలపై దాడి చేయడం జరిగిందని వారు తెలిపారు. అన్ని దుకాణాలను తనిఖీ చేయగా సుమారు ఒక టన్ను ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకొని, ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ యార్డు కు పంపడం జరిగిందని వారు తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై ఇదివరకే దుకాణదారులకు అందరికీ కూడా పలుమార్లు సమాచారాన్ని అందించడం జరిగిందని, నిర్లక్ష్య ధోరణి ఉండటంతో ఇకనుంచి ప్రతిరోజు ప్లాస్టిక్ వాడకంపై దాడి నిర్వహిస్తామని తెలిపారు. ఏ ప్లాస్టిక్ వాడాలి? ఏది వాడకూడదు? అన్న విషయాలను దుకాణా దారులకు తెలియజేయడం జరిగిందన్నారు. బ్రాందీ షాపులలో వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ గ్లాసులు వాడడం, ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీ నరసింహులు, సచివాలయ శానిటరీ సెక్రటరీలు పదిమంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img