Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

అర్దరాత్రి వేళ… అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సెబ్ అదనపు ఎస్ పి జి. రామకృష్ణ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : కర్నాటక సరిహద్దుల్లో నిర్వహిస్తున్న గాలిమారెమ్మ టెంపుల్ ఇంటిగ్రేటెడ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టును మరియు సోమలాపురం, హులికల్, విడపనకల్లు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ అర్ధరాత్రి నుండీ తెల్లవారుజాము వరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిష్టర్ ను పరిశీలించారు. కర్నాటకకు వెళ్లొచ్చే వాహనాలను లోతుగా చెక్ చేయాలన్నారు. కర్నాటక లిక్కర్, డబ్బు, చీరలు, తదితరాలు అక్రమంగా తరలించకుండా నిరంతర తనిఖీలు చేయాలి… సీజర్స్ పెంచాలన్నారు. చెక్ పోస్టుల గుండా వెళ్లొచ్చే రహదారులకు ప్రత్యామ్నాయంగా ఉన్న అడ్డదారులు, కాలినడక మార్గాలపై రూట్ వాచ్ పెట్టి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలలో పాల్గొని ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img