Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సి యూ ఏపి సందర్శించిన భారత ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, కె. సంజయ్ మూర్తి

విశాలాంధ్ర – అనంతపురం : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, కె సంజయ్ మూర్తి (ఐఏఎస్ ), అనంతపురం సమీపంలోని జంతలూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని సందర్శించారు.
ఆయన వెంట విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఆచార్య ఎస్‌. ఎ కోరి, ఇన్‌చార్జి డీన్‌ ఆచార్య షీలారెడ్డి, ఆచార్య రాంరెడ్డి, ఇతర అధ్యాపకులు ఉన్నారు. కొత్త ప్రాంగణంలో వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించే ప్రణాళిక గురించి ఆచార్య కోరి ఆయనకు వివరించగా, నిర్మాణ వేగాన్ని ఆయన ప్రశంసించారు. కె. సంజయ మూర్తి జెఎన్‌టియు క్యాంపస్‌లోని తాత్కాలిక క్యాంపస్‌ను కూడా సందర్శించి, అక్కడ అధ్యాపకులతో సంభాషించారు.
ఆచార్య ఎస్. ఎ. కోరి అధ్యాపకులను పరిచయం చేస్తూ అధ్యాపకులు, విద్యార్థుల సంఖ్య పెంచడం గురించి, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే కొత్త ప్రోగ్రామ్‌లపై నవీకరణల గురించి వివరించారు. దీని తర్వాత కొత్త ప్రోగ్రామ్‌లు, డిసెర్టేషన్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, మల్టీడిసిప్లినరీ కోర్సులు మరియు మూక్ లను సమీకరిస్తూ చేస్తూ ఎన్ ఈ పి 2020 అమలు చేయడంపై చర్చలు జరిగాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐ ఐ ఎం తిరుచ్చి మరియు ఐ ఐ ఎం కోజికోడ్‌ లలో శిక్షణ శిబిరాలకు హాజరైన కొందరు అధ్యాపకులు వారి అనుభవాలను పంచుకున్నారు. కె. సంజయ్ మూర్తి, కృత్రిమ మేధ మరియు గణిత సామర్థ్యాన్ని పెంచే కోర్సుల యొక్క ప్రాముఖ్యతను వివరించి, కన్సల్టెన్సీ సేవలను ప్రోత్సహించాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని, ముఖ్యంగా కొత్త క్యాంపస్‌ను బలోపేతం చేయడంలో ఉపకులపతి మరియు అధ్యాపకుల కృషిని వారు ప్రశంసించారు. విశ్వవిద్యాలయ సభ్యులు అంతా వారికి ఆత్మీయ సత్కారం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img