Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అంత‌ర్జాతీయ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్స‌వం

డాక్టర్. జాషువా కాలేబ్ .కె
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : పార్కిన్సన్స్ వ్యాధిని జేమ్స్ పార్కిన్సన్స్ తన ప్రచురణలో “షేకింగ్ పారాలిసిస్ అనే ఒక వ్యాసం” లో 1817 సంవత్సరంలో వివరించాడు.
అతని పుట్టినరోజు జ్ఞాపకార్థం ఏప్రిల్ 11 ను ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్స‌వంగా నిర్వ‌హిస్తారు. ప్రజలలో అవగాహన కలిగించడానికి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాదిగురించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి మెదడు లోని సబ్ స్టాన్షియా నైగ్రా అనే భాగములో డోపమైన్ అనే రసాయణo లోపించడం వల్ల వస్తుంది.
పార్కిన్సన్స్ వ్యాధి 60 సంవత్సరాల వయస్సు తర్వాత తరచుగా వ‌స్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ట్రాప్ అనే అక్షరాలతో సూచిస్తారు, టి అనగా ట్రెమర్,అనగా చేతులు వనకటం, ఆర్ అనగా రిజిడిటి అనగా కాళ్లు ,చేతులు మరియు శరీరము బిగుతుగా ఉండటం, ఏ అనగా ఎకైనీసియా అనగా వ్యక్తి నిదానమవటం పి అనగా పోస్టురల్ ఇన్స్టెబిలిటీ అనగా నడకలో స్థిరత్వం లేకపోవటం.ఇది టి ఆర్ ఏ పి అనే ఎక్రోనిం గా గుర్తుంచుకోబడుతుంది.
వ్యాధి ప్రారంభంలో గుర్తించటానికి, నిర్ధారించటానికి నిపుణుడైన న్యూరోఫిజిషియన్‌ను చూడటం మరియు అటువంటి రోగులను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స చేయటం చాలా అవసరం. చాలా తరచుగా వారు మందులతోనే మెరుగవటం జరుగుతుంది. కొంతమంది రోగులకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే శస్త్రచికిత్స చికిత్స అవసరం కావచ్చు.
ఇంట్రా జుజునల్ లీవోడోపా జెల్, అపో మార్ఫిన్ ఇంజెక్షన్ల వంటి అధునాతన ఔష‌దాలు పార్కిన్సన్స్ వ్యాధికి ఇటీవలి రోజుల్లో అందుబాటులోకి వచ్చాయి.
పార్కిన్‌స‌న్స్ డీసీజ్ (పీడీ ) రోగులందరూ శారీరకంగా ఎక్కువసేపు చురుకుగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది.
కొన్నిసార్లు ఈ జబ్బు మానసిక ఔషధాలను ఉపయోగించడం, హెవీ మెటల్స్ వలన మరియు హైడ్రో కె ఫా లస్ అనే వ్యాధి వల్ల కూడా పార్కింసోన్స్ వ్యాధిని పోలిన లక్షణాలు కనిపిస్తాయి.
20% కన్నా తక్కువ మంది రోగులలో ఈ వ్యాధి 40 సంవత్సరాల ముందు వ‌స్తుంది. దీనిని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ (వై ఓ పి డి ) అంటారు.

కొన్నిసార్లు ఇది జన్యు వారసత్వం కారణంగా కూడా వ‌స్తుంది.
పార్కిన్సోనిజం ప్లస్ సిండ్రోమ్స్ అనేవి ఇందులోనే తీవ్రమైన తరహా వ్యాధులు, ఇందులో వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది తొందరగా రోగి అచేతనం అవటం జరుగుతుంది, వీటిలో టి ఆర్ ఏ పి లక్షణాలతో పాటు వారు తరచుగా పడిపోవడం, మింగడం లో కష్టం, మూత్రం పోయ‌డంలో ఇబ్బంది, నిద్ర లేక‌పోవ‌డం, జ్ఞాపకశక్తి లోపించడం, భ్రాంతులు మొదలైన ఇతర లక్షణాలు ఉంటాయి. ఈ రకమైన రోగులకు ప్రత్యేక శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం, ఎందుకంటే వారు వ్యాధి యొక్క ప్రారంభ దశల నుండి విభిన్న సమస్యలను ఎదుర్కొంటుంటారు.
పార్కిన్సన్స్ వ్యాధిని త‌గ్గించ‌వ‌చ్చు. అయితే ముందస్తు గుర్తింపు మరియు సత్వర చికిత్సతో రోగి సాధారణ జీవితానికి దగ్గరవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img