Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నులిపురుగులను నిర్మూలిద్దాం… ఆప్తాలిక్ అధికారి డాక్టర్ ఉరుకుందప్ప

విశాలాంధ్ర -ధర్మవరం: నులి పురుగులను నిర్మూలిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆపుతాలిక అధికారి డాక్టర్ ఉరుకుందప్ప, ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చెన్నారెడ్డి,డాక్టర్ సురేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ పాఠశాలలో మంగళవారం నులిపురుగుల నివారణ దినోత్సవం పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండా జోల్400 మిల్లీగ్రాముల మాత్రలు 0-5 సంవత్సరాల పిల్లలకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో, పాఠశాలల్లో, కళాశాలలో ఉచితంగా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పిల్లలకు నులిపురుగుల నిర్మూలల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తెలియజేయాలని, రక్తహీనతను నివారిస్తుందని, పోషకాల గ్రహితను మెరుగుపరుస్తుందని వారు తెలిపారు.1-2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర, 2-19 సంవత్సరాల విద్యార్థులకు పూర్తి మాత్రలు ఇచ్చేలా చూడాలన్నారు. ఎక్కడైనా ఈ మాత్రలు వేసుకొని వారికి ఈనెల 17వ తేదీన తిరిగి వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, సూపర్వైజర్ రాజేష్, ఉపాధ్యాయ బృందం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img