Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నైపుణ్యాలను వెలికి తీసేందుకే “ఆడుదాం ఆంధ్ర”..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడం వారిలో నైపుణ్యాలను మరింతగా పెంచడానికి “ఆడుదాం ఆంధ్ర” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెండవ రోజు పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో క్రికెట్ క్రీడలను వారు ప్రారంభించారు. తదుపరి క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆట గెలుపుకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహాయ సహకారాలతో ఈ క్రీడలు ప్రారంభిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చేపట్టిన ఈ క్రీడలు సంబరాలు జరుపుకోవడం క్రీడాకారులకు ఒక వరంలాగా మారిందని తెలిపారు. వివిధ రకాల క్రీడలను తెలిపిన శెట్టి రోజుల్లో నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల క్రీడాకారులు అందులో పాల్గొని మంచి నైపుణ్యాన్ని పొందితే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు. యువత క్రీడారంగంలో కూడా రాణించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రకు శ్రీకారం చుట్టిందని వారు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసము, విద్యార్థుల కోసం కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. టీవీలు, సెల్ ఫోన్లకు, బానిసలు కాకుండా విద్యార్థులను, యువకులను క్రీడల పట్ల ఆసక్తి చూపేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం ఆనందదాయకమన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంచేలా ప్రతి కీరకారుడు తన యొక్క సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. తదుపరి ఆర్ డి టి స్టేడియం తిక్క స్వామి నగర్ సచివాలయం తరఫున ముఖ్యఅతిథిగా కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. అక్కడి క్రీడాకారులతో గౌరవ వందనముతో పాటు పరిచయ కార్యక్రమాలు చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర గ్రౌండ్లో గూడ్స్ కొట్టాల సచివాలయానికి చెందిన రెండు జట్లు, ఇందులో బీ టీం విజేతగా, తదుపరి చంద్రబాబు నగర్ సచివాలయంలో రెండు టీముల్లో ఏ. టీం విజేతగా, శారద నగర్ సచివాలయంలో రెండు టీములు గాను బి. విజేతగా, టీచర్స్ కాలనీలో రెండు టీములుగాను ఏ. టీం విజేతగా, తదుపరి తిక్క స్వామి నగర్ సచివాలయం పరిధిలో రెండు టీములుగాను ఏ. టీం విజేతగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు వేముల జయరాం రెడ్డి, శంషాద్ బేగం,మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ ఆనంద్ కుమార్,పట్టణ వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు, పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img