Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మద్యం పట్టివేత కేసు నమోదు

తాడిమర్రి పోలీసులు

విశాలాంధ్ర – తాడిమర్రి:: మండల పరిధిలోని దాడి తోట దగ్గర తాడిమర్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 02 టిబి 5353 అనే నెంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా, 1,52,000 విలువచేసే అక్రమ మద్యాన్ని ఎస్సై నాగ స్వామి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. అనంతరం ఎస్సై మద్యంతో పాటు లారీని కూడా సీ చేసి తాడిమర్రి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం తరలిస్తున్న వారిలో కే. సాహిత్, దూదేకుల కుల్లాయి స్వామి, మాలపాటి రవితేజ, సుందూ సురేష్, హరికృష్ణ, కూటం దేవానంద్, ఏటూరి రజిని కుమార్, కమ్మ నరేష్ వీరిని అరెస్టు చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం డిఎస్పి శ్రీనివాసులు.. సిఐ కృష్ణంరాజు, ఎస్ఐ నాగ స్వామిని, సిబ్బందిని అభినందించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలలో మమేకం చేస్తూ, కావలసిన సమాచారాన్ని రాబట్టుకుంటూ, నేర నియంత్రణకు అక్రమ రవాణాకు అడ్డుగట్ట వేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img