Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కిడ్నీ బాధితురాలుకు ఆర్థిక సహాయం అందించిన తారక్ చేయూత ట్రస్ట్

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన షర్మిల (21 సంవత్సరాలు) గత 19 నెలలుగా రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్పై జీవన పోరాటం సాగిస్తోంది. ప్రభుత్వ పెన్షన్ కూడా నెలవారి వైద్యానికి సరిపోవటం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వీరి పరిస్థితిని స్థానికులు తారక్ చేత ట్రస్ట్ వారికి సమాచారాన్ని అందించారు. తారక్ చేయూత ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాంజి హుటాహుటిన దాత అయిన ఎర్రజోడు లోకేష్ దృష్టికి తీసుకొని పోగా, దాత తనవంతుగా షర్మిలా కుటుంబానికి మూడు వేల రూపాయలు విలువగల నిత్యావసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల నగదును అందజేశారు. దీంతో తారక్ చేయుట ట్రస్ట్ తరఫున వారి ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు. బాధిత కుటుంబీకులు దాత లోకేష్ కు, తారక్ చైత ట్రస్ట్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకి, సహకార దర్శి రమేష్, కోశాధికారి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి తుకారాం తోపాటు వేణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img