Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చర్యలు

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పకడ్బందీగా మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ను అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై క్షేత్రస్థాయిలో నిత్యం మానిటర్ చేస్తున్నామని, ఎక్కడా ఎంసిసి ఉల్లంఘన జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి విషయమై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రిటర్నింగ్ అధికారులు కరుణకుమారి, వెన్నెల శీను, నోడల్ అధికారులు భాస్కర్, ఉమామహేశ్వరమ్మ, ఎంసిఎంసి మెంబర్ సెక్రెటరీ పి.గురుస్వామిశెట్టి, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img