Friday, May 17, 2024
Friday, May 17, 2024

క్రీడలతో మానసిక ఉల్లాసం

వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాలలోని బాలికల వసతి గృహంలో విద్యార్థులకు షటిల్ కోర్టును, టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ శంషాద్ బేగం, ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ లు డాక్టర్ సుచిత్ర శౌరి, డాక్టర్ వేముల సరోజ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ ప్రతిరోజు మన దైనందిన జీవితంలో వ్యాయామం తప్పనిసరి కావాలని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం మానసిక దృఢత్వం కలుగుతాయని, వ్యాయామం శారీరకంగాను మానసికంగాను పెంపొందించుకోవడానికి ఆటలు, యోగ ప్రణయామం లాంటివి ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతిరోజు వీటిలో పాల్గొని మానసిక ఒత్తిడిని తగ్గించుకొని చదువులో మరింత మంచిగా కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img