Friday, May 17, 2024
Friday, May 17, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని సూపర్డెంట్ మాధవి పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు నెలవారి పరీక్షలు, ప్రసవాలు, బాలింతలకు చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వివిధ రకాల ఉచిత రక్త పరీక్షలతో, ప్రత్యేక నిపుణులైన వైద్యులతో వైద్య చికిత్సలను కూడా అందిస్తున్నామని తెలిపారు. బిపి, షుగర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకొని, తగిన మందులను తీసుకోవాలని తెలిపారు. నేటి కాలంలో అన్ని వయసుల వారికి బీపీలు షుగర్లు వస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాత, నూతన ఆసుపత్రులలో కూడా రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పట్టణములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయని, అక్కడ కూడా రక్త పరీక్షలతోపాటు అన్ని రకాల జబ్బులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సలహాలు సూచనలు అక్కడి డాక్టర్లు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. సొంత వైద్యం పనికిరాదని, అది ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తుందని తెలిపారు. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img