Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఘనంగా జరిగిన మొహరం పండుగ వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్యగుట్ట, యాదవ్ వీధి, కొత్తపేట, లోని కోట, తేరు బజార్లలో పీర్ల చావిడి కమిటీ ఆధ్వర్యంలో శనివారం మొహరం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. గత కొన్ని రోజులుగా మొహరం వేడుకలను వివిధ రూపాలలో ప్రత్యేక పూజలను వనర్చారు. అనంతరం శనివారం ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం అగ్ని గుండం ద్వారా తమ భక్తిని చాటుకొని, సాయంత్రం పీర్ల జాబిడి కమిటీ వారు నిర్ణయించిన ప్రదేశాలలో జల్ది కార్యక్రమముతో అలంకరణతో పట్టణ పురవీధులలో ఊరేగించి కార్యక్రమాలను ముగించారు. ప్రతి సంవత్సరము వచ్చే ఈ మొహరం పండుగను హిందూ, ముస్లింలు ఆనవాయితీగా జరుపుకుంటారు. ఈ పండగలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, మొహరం పండుగ ద్వారా దైవాన్ని సందర్శించుకుంటారు. పీర్ల చావిడి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరుల త్యాగాలకు చిహ్నమని, ప్రేమ, త్యాగం, శాంతి సందేశాన్ని తెలిపేదే ఈ మొహరం పండుగ అని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ మానవాళికి ఈ మొహరం పండుగ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. త్యాగ గుణాన్ని గౌరవించేందుకు వీరత్వం నుంచి స్ఫూర్తి పొందేందుకు, మొహరం పండుగను జరుపుకుంటామని తెలిపారు. మానవాళిలో ఐక్యతను నింపేందుకే ఈ పండుగ ఎంతో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. జల్దీ కార్యక్రమము ద్వారా అందరూ ఒకచోట, పురవీధుల గుండా ఊరేగింపుగా కలుస్తారని తెలిపారు. లోని కోట గాండ్ల వీధి పీర్లవారు చెరువు కట్ట లో నిర్వహిస్తారు, కొత్తపేట పీర్లవారు రైల్వేటేషన్ వద్ద, యాదవ వీధి, నెహ్రూ నగర్ పీర్లవారు సాయిబాబా గుడి వద్ద జల్దిని నిర్వహిస్తారని తెలిపారు. పీర్లను ప్రత్యేక అలంకరణతో చేసిన వైనం భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, చక్కెరతో చదివింపులు చేసి, వాటిని భక్తాదులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. డప్పు, వాయిద్యాల నడుమ ఈ పండుగ కన్నులు విందులుగా భక్తాదులు తనివితీరా దర్శిస్తారని తెలిపారు. హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంతో చేసే పండుగ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు పొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img